Bigg Boss Season 6: బిగ్ బాస్ ని నిలిపివేయాలి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఐదు

  • Written By:
  • Updated On - September 30, 2022 / 03:15 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇటీవలే బిగ్ బాస్ 6వ సీజన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల మధ్య ప్రేమలు, కోపడ్డాలు, తిట్టుకోవడాలు లాంటివి బాగానే జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ నీ కూడా ఇష్టపడే ప్రేక్షకులు కొంతమంది అయితే విమర్శించే వారు అదే స్థాయిలో ఉన్నారు.

ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 షోని నిలిపివేయాలి అంటూ ఒక న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇకపోతే ఇటీవల 21 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే బిగ్బాస్ హౌస్ లో కొత్త టాస్క్లతో పాటు రొమాన్స్ ప్రేమ కహానీలు లాంటి అంశాలను హైలెట్ చేస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ షోలో లేడీ కంటెస్టెంట్లు కూడా రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేస్తున్నారు. దీంతో చాలామంది బిగ్ బాస్ షో ని ఒక బూతు షో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 నిలిపివేయాలి అంటూ ఏకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ రియాల్టీ షోలో అశ్లీలత ఎక్కువ అయ్యింది అన్ని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ షోలో అశ్లీల ఎక్కువ అయిన కారణంగా చట్టపరంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 మధ్య ప్రసారం చేయాలి అని హైకోర్టుని కోరారు. మరి ఈ విషయంపై హైకోర్టు ఏ విధంగా తీర్పును ఇస్తుందో వేచి చూడాలి మరి.