Site icon HashtagU Telugu

Bigg Boss Winner : పొలం పనులు చేసుకుంటున్న బిగ్ బాస్ విన్నర్..ఇలా అయిపోయాడేంటి..?

bigg boss season 4 winner abhijeet doing farming

bigg boss season 4 winner abhijeet doing farming

నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)..ఇప్పుడు అన్ని భాషల్లో రాణిస్తుంది. ముఖ్యంగా తెలుగునాట అత్యధిక TRP రేటింగ్ తో దూకుడు కనపరుస్తుంది. రీసెంట్ గా సీజన్ 7 (Bigg Boss 7)మొదలైంది. ఇక బిగ్ బాస్ షో లో ఒక్కసారైనా పాల్గొనాలని సినీ స్టార్స్ దగ్గరి నుండి సామాన్య ప్రజల వరకు కోరుకుంటుంటారు. ఇందుకు తగ్గట్లే బిగ్ బాస్ యాజమాన్యం..కాస్త జనాల్లో పాపులర్ అయినా వారిని ఎంపిక చేస్తుంటుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ (Bigg Boss House) లో అడుగుపెట్టారంటే వారి జాతకం పూర్తిగా మారిపోయినట్లే. అప్పటివరకు వారంటే తెలియని వారు సైతం వారితో ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలని భావిస్తుంటారు. ఇప్పటివరకు చాలామంది సెలబ్రటీస్ గా మారిపోయారు. వరుస సినిమా ఛాన్సులు , బుల్లితెర ఛాన్సులతో రాణిస్తున్నారు. అయితే ఒక్కరు మాత్రం ఎలాంటి ఛాన్సులు లేకుండా పొలం పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. అతడు మాములు హౌస్ సభ్యుడు కూడా కాదు..బిగ్ బాస్ టైటిల్ విన్నర్ (Bigg Boss Season 4 Winner) కూడా. అలాంటి విన్నర్..ప్రస్తుతం సినిమా ఛాన్సులు లేక ట్రాక్టర్ దున్నుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఇదే అందర్నీ షాక్ లో పడేస్తుంది.

లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ తో యూత్ కు దగ్గరైన అభిజిత్ (Abhijeet ) ..ఆ తర్వాత బిగ్ బాస్ నాల్గో సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టాడు. మొదటి నుండి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చి..టైటిల్ విన్నర్ అయ్యాడు. ఈ దెబ్బ తో అభిజిత్ జాతకం పూర్తిగా మారినట్లే అని..వరుస సినిమాలతో బిజీ కావడం ఖాయమని అంత భావించారు. కానీ అభిజిత్ కు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా తలుపు తట్టలేదు. ఇదే సీజన్ లో పాల్గొన్న సోహెల్, అఖిల్, అవినాష్, మెహబూబ్, దివి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా బిగ్ బాస్ ట్యాగ్‌ను వాడుకుంటూ కెరియర్ ను ఫుల్ స్వింగ్ లోకి తీసుకొచ్చుకున్నారు. కానీ అభిజిత్ మాత్రం ఎక్కడ కనిపించలేదు.

Read Also : Lokesh Effect : కేశినేని ఔట్ !విజ‌య‌వాడ బ‌రిలో ల‌గ‌డ‌పాటి?

బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ ను అనారోగ్య సమస్యలు (Abhijeet Health Issues) వెంటాడాయి. నడము, కాళ్ల సమస్యలు వెంటాడటం, సర్జరీలు జరగడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఓ వెబ్ సిరీస్‌లో మాత్రం అలా మెరిశాడు. మొదటి నుండి అభిజిత్ కు ఒంటరిగా ప్రయాణాలు, ట్రావెలింగ్ చేయడం వంటివి ఇష్టపడుతుంటాడు. అడ్వెంచర్లు చేయడమే తన అలవాటుగా మార్చుకున్నాడు. అందుకు తగ్గ వాహనాలను సమకూర్చుకుంటాడు. ప్రస్తుతం ట్రావెలింగ్ తన లోకం అన్నట్టుగా బ్రతికేస్తున్నాడు. తాజాగా వ్యవసాయం (Abhijeet Doing farming) చేస్తూ కనిపించి షాక్ ఇచ్చాడు. ట్రాక్టర్ తో పొలం పనులు చేసుకుంటున్నట్లు అభిజిత్ కనిపించేసరికి ఫ్యాన్స్ , సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. అరే అభిజిత్ ఏంటి ఇలా అయిపోయాడేంటి అని కామెంట్స్ పెడుతున్నారు.