Green India Challenge: మొక్కలు నాటిన బిగ్ బాస్ బ్యూటీ

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Inaya Sultana

Inaya Sultana

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, హీరోహీరోయిన్స్ తమవంతుగా పాల్గొంటూ గ్రీన్ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. బుధవారం హైదరాబాద్  జూబ్లీహిల్స్ లో  బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇనయా సుల్తానా మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఇప్పుడు ఉన్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్నా, ప్రాణ వాయువు కావాలన్నా మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు. ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా మొక్కలు నాటాలని కోరారు. తనను అభిమానానించే వారు అందరూ మొక్కలు నాటి #GreenIndiaChallenge కి, తన ఇంస్టాగ్రామ్ కి టాగ్ చేయాలని కోరారు.  ఫైమా, రాజ్, వరుణ్ సందేశ్, వితిక మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

  Last Updated: 04 Jan 2023, 05:33 PM IST