Site icon HashtagU Telugu

Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ కు తప్పిన పెను ప్రమాదం.. కారును ఢీకొట్టిన స్కూల్ బస్సు

Urvashi Dholakia

Resizeimagesize (1280 X 720) (2)

బిగ్ బాస్ 6 విజేతగా నిలిచిన నటి ఊర్వశి ధోలాకియా (Urvashi Dholakia) కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి సహా ఆమె సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. షూటింగ్‌కి వెళ్లిన ఊర్వశి కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత ఊర్వశి బాగానే ఉందని, అయితే డాక్టర్ ఆమెకు బెడ్ రెస్ట్ సూచించారని చెబుతున్నారు.

శనివారం (ఫిబ్రవరి 4) ఊర్వశి ధోలాకియా మీరారోడ్‌లోని ఫిల్మ్‌ స్టూడియోలో షూటింగ్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. పిల్లలతో వెళ్తున్న పాఠశాల బస్సు వారి కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఊర్వశి స్వయంగా కారు నడుపుతున్నందున ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, అయితే అదృష్టవశాత్తూ నటి లేదా ఆమె సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబందించి ఊర్వశి కారు డ్రైవర్‌ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

Also Read: Nayanthara Casting Couch: అడిగింది చేయాలని కండిషన్ పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార..!

ఊర్వశి చిన్న వయస్సులోనే నటనా రంగంలోకి ప్రవేశించారు. దేఖ్ భాయ్ దేఖ్, శక్తిమాన్, కభీ సౌతాన్ కభీ సహేలి, తుమ్ బిన్ జావూన్ కహాన్, కహిన్ తో హోగా, బైతాబ్ దిల్ కీ తమన్నా హై, చంద్రకాంత – ఏక్ మాయావి ప్రేమ్ గాథ వంటి అనేక టీవీ షోలలో నటించారు. ఊర్వశి ‘కసౌతి జిందగీ కి’లో ‘కొమొలికా’ పాత్రతో ఇప్పటికీ గుర్తుండిపోతుంది. దీనితో పాటు, టీవీలో అత్యంత వివాదాస్పద షోగా పిలువబడే బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా కూడా నిలిచింది. నాగిన్ 6తో సహా పలు హిట్ షోలలో ఊర్వశి భాగమైంది.