Site icon HashtagU Telugu

TRS : మోడీ టూర్‌కు ముందు బీజేపీకి బిగ్‌షాక్‌.. టీఆర్ఎస్‌లో చేరిన‌..!

Trs Joining

Trs Joining

హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందు బీజేపీకి ఊహించని షాక్ త‌గిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్‌లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్​లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు. ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా,.. మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్​లో చేరడం బీజేపీకి ఊహించని విధంగా షాక్ త‌గిలింది.

TRS

Exit mobile version