హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు (Passengers) భారీ షాక్ (Big Shock) ఇచ్చింది ఎల్అండ్‌టీ (L&T) యాజమాన్యం. ఫ్రీ పార్కింగ్ ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6 ( ఆదివారం) నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద చార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఆగస్టు 14 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో రైలు డిపోల వద్ద ఉన్న ఉచిత పార్కింగ్‌ను ఎత్తివేసి పార్కింగ్ ఫీజులను వసూలు చేయనున్నట్టు చెప్పడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం తో ఫీజు వసూళ్లను వాయిదా వేస్తున్నట్లు తెలిపి కాస్త ఉపశమనం కల్పించింది. కానీ ఇప్పుడు ఫీజు వసూళ్లకు సిద్ధం అవ్వడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పార్కింగ్ ఫీజుల విషయానికి వస్తే.. బైక్‌ని 2గంటల పాటు పార్కింగ్ చేస్తే రూ.10 చెల్లించాల్సి వస్తుంది. 8గంటలకు రూ.25 చెల్లించాల్సి ఉండగా.. 12గంటలకు రూ.40 పార్కింగ్ ఫీజుగా నిర్ణయించారు. కార్‌కి 2గంటలకు రూ.30.. 12గంటలకు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదనంగా ఒక్కో గంటకు రూ.5చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నెలవారీ పాసులు సైతం తీసుకువచ్చారు. పాస్‌లపై 40శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Read Also : RGV : వర్మ బెడ్ రూమ్ ను వాడుకున్న పనిమనిషి..