Mulugu Congress : ములుగులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్ర మొగిలితో పాటు మరికొందరు ఆదివారం బడే నాగజ్యోతి సమక్షంలో

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 11:42 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ పడనేలేదు..అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రీసెంట్ గా తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం చేయడం తో..నియోజకవర్గాలలో అప్పుడే వలసల పర్వం మొదలైంది. కొంతమంది టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతుండగా..మరోపక్క ఇతర పార్టీల నేతలు , కార్యకర్తలు అధికార పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా ములుగు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది.

ములుగు నియోజకవర్గం (Mulugu Constituency)నుండి కాంగ్రెస్ తరుపున సీతక్క (Seethakka)బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా సీతక్క భారీ విజయం సాధించి..కాంగ్రెస్ పరువు నిలిపింది. అధికారంలో తమ ప్రభుత్వం లేనప్పటికీ..ప్రజల అవసరాలను తీరుస్తూ..వారి సమస్యల ఫై పోరాటడం చేస్తూ..విపత్తుల సమయంలో తన వంతు సాయం చేస్తూ వస్తుంది. ఈసారి అధికార పార్టీ బిఆర్ఎస్..ములుగు నియోజకవర్గం ఫై మరింత ఫోకస్ చేసింది. ఈసారి ఎలాగైనా ములుగులో సీతక్కను ఓడించాలనే లక్ష్యంతో బడే నాగజ్యోతి (Bade Nagajyothi) ని బరిలోకి దింపింది బిఆర్ఎస్.

బడే నాగజ్యోతి ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ తాడువాయి మండలంలోని ఓ మారుమూలపల్లె కాల్వపల్లిలో 1994 లో జన్మించింది. బడే నాగజ్యోతి తల్లిదండ్రులు బడే రాజేశ్వరి అలియాస్ నిర్మల, నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్. తల్లిదండ్రులు ఇద్దరు పీపుల్స్ వారు పార్టీలో నక్సలైట్లు. వారు దళంలో ఉండగానే నాగజ్యోతి జన్మించింది. చిన్నతనంలోనే నానమ్మ, తాతయ్యల దగ్గర వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తండ్రి మరణించాడు,

తల్లి లొంగిపోయింది. అలా కొన్నాళ్ళకు ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అలాంటి బడే నాగజ్యోతి ముందుగా కాల్వపల్లి సర్పంచ్ గా ఎన్నికయింది. ఆ తర్వాత ఒక్కో మెట్టెక్కుతూ తాడ్వాయి జెడ్పిటిసి, జడ్పీ చైర్ పర్సన్, ఇటీవల జడ్పీ చైర్మన్ మరణంతో ఇంచార్జ్ చైర్పర్సన్ గా బాధ్యతలు కూడా చేపట్టింది. ఇలా ములుగు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగజ్యోతి కేసీఆర్ దృష్టిలో పడింది. దీంతో ఆమెను సీతక్కపై పోటీ చేసేందుకు టికెట్ ఖరారు చేశారు. ఈమెకు బిఆర్ఎస్ టికెట్ ఇవ్వడం తో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సీతక్క తో నడిచినవారు సైతం ఇప్పుడు జ్యోతి వెంట అడుగులు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ (Congress) పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సీతక్క( Seetakka) అనుచరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ (BRS) లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్ర మొగిలితో పాటు మరికొందరు ఆదివారం బడే నాగజ్యోతి సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌ (CM KCR) ప్రజల సమస్యలు తెలిసిన మనిషిగా, అధికార వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కన్నాయిగూడెం మండలాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్న కన్నాయిగుడం మండలం నుంచి 50 మంది,అబ్బా పూర్ ములుగు నుంచి కాంగ్రెస్ నాయకులు, యువకులు చేరారని బడే నాగజ్యోతి అన్నారు. తనను గెలిపిస్తే ములుగు (Mulugu) నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని వెల్లడించారు.

మొత్తం మీద ఈసారి ములుగు ఎన్నికలు గట్టిగానే ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది. మరి ఈ ఎన్నికల్లో మాజీ నక్సలైట్ గెలుస్తుందా..లేక మాజీ నక్సలైట్ కూతురు గెలుస్తుందా అనేది చూడాలి.