Swiggy Users: స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్.. ఇక నుంచి అదనపు ఛార్జీలు

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. కొత్తగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. ఫుడ్ ఆర్డర్లకు దీనిని వర్తింపజేయనుంది.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 09:21 PM IST

Swiggy Users: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. కొత్తగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. ఫుడ్ ఆర్డర్లకు దీనిని వర్తింపజేయనుంది. స్విగ్గీ కార్ట్ విలువతో సంబంధం లేకుండా అదనపు రుసుంలను వసూలుచ చేయాలని స్విగ్గీ నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకునే దిశగా స్విగ్గీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫ్లాట్ ఫామ్ ఫీజు విధానం ద్వారా ప్రతి ఆర్డర్ పై అదనంగా రూ.2 వసూలు చేయనుంది. ఫుడ్ డెలివరీలకు మాత్రమే ఈ ఛార్జీలను వసూలు చేయనుంది. సరుకులు డెలివరీ చేసే ఇన్‌స్టామార్ట్‌కు ఇలాంటి ఛార్జీలు ఏం ఉండవు. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరులలో ఈ ఫ్లాట్‌ఫామ్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇన్‌స్టామార్ట్‌కు కూడా ఫ్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే బెంగళూరు, హైదరాబాద్ కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా ఈ ఫ్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేసే విధానాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజుకు స్విగ్గీలో దాదాపు 15 లక్షల ఫుడ్ డెలివరీ అవుతాయి. ఒక్కొ డెలివరీ నుంచి రూ.2 అంటే స్విగ్గీకి చాలా డబ్బులు వస్తాయి. ఫుడ్ డెలివరీలు తగ్గడం, నగదు నిల్వలు తగ్గడం వల్ల కొత్తగా ఈ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు.స్విగ్గీ నిర్ణయంతో యూజర్లకు షాక్ తగిలింది. ఈ నిర్ణయంతో యూజర్లపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ నిర్ణయంపై చాలామంది మండిపడుతున్నారు. దీని వల్ల యూజర్లపై అదనపు భారం పడుతుందని అంటున్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని స్విగ్గీ యూజర్లు వ్యతిరేకిస్తున్నారు.