Site icon HashtagU Telugu

Harshal Patel: బబుల్ ను వీడిన బెంగుళూరు స్టార్ బౌలర్

Harshal Patel

Harshal Patel

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హార్షల్ పటేల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హర్షల్ సోదరి మృతి చెందారు. దీంతో ఈ పేసర్ ఐపీఎల్ బయో బబుల్ వీడి ఇంటికి వెళ్లిపోయాడు. ముంబై తో మ్యాచ్ ముగిసిన రాత్రి ఈ దురదృష్టకరమైన వార్త తెలియడంతో అతను బబుల్ ను వీడినట్టు ఆ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.మంగళవారం లోపు హర్షల్ పటేల్ మళ్లీ ఐపీఎల్ బబుల్‌లోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ఐపీఎల్ అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరు టీమ్ తన తర్వాత మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆడనుంది.

ముంబైతో మ్యాచ్‌లో ఆడిన హర్షల్ పటేల్.. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 5.80 ఎకానమీతో కేవలం 23 పరుగులే ఇచ్చిన హర్షల్ పటేల్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్‌ని కట్టడి చేశాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆడిన హర్షల్ పటేల్.. 5.50 ఎకానమీతో కేవలం 88 పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు వికెట్లని పడగొట్టిన ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. గత ఏడాది బెంగళూరు తరఫున 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఈ ఏడాది వేలంలో హర్షల్‌ని రూ.10.75 కోట్లకి బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.