Odisha Trains Accident : ఆ రైలు డ్రైవర్ చివరి మాటల్లో.. పెద్ద క్లూ!

రైలు ప్రమాదానికి(Odisha Trains Accident) గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుణనిధి మొహంతీ స్టేట్‌మెంట్‌ను అధికారులు సోమవారం రికార్డు చేశారు. "మేం లూప్‌లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ లేదు. గ్రీన్ సిగ్నలే ఉంది. ప్రమాద సమయంలోనూ ట్రైన్ వేగం మామూలుగానే ఉంది" అని అతడు చెప్పినట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Odisha Trains Accident

Odisha Trains Accident

రైలు ప్రమాదానికి(Odisha Trains Accident) గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుణనిధి మొహంతీ స్టేట్‌మెంట్‌ను అధికారులు సోమవారం రికార్డు చేశారు. “మేం లూప్‌లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ లేదు. గ్రీన్ సిగ్నలే ఉంది. ప్రమాద(Odisha Trains Accident) సమయంలోనూ ట్రైన్ వేగం మామూలుగానే ఉంది” అని అతడు చెప్పినట్టు తెలుస్తోంది. మొహంతి చివరి మాటలను దర్యాప్తులో పెద్ద క్లూగా భావించవచ్చని రైల్వే అధికారులు అంటున్నారు. రైలు ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్ గుణానిధి మొహంతి, అసిస్టెంట్ లోకో పైలట్ హజారీ బెహెరా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఏఎంఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హ‌జారి బెహిరా సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా, మ‌రో లోకో పైలెట్ డ్రైవ‌ర్ జీఎన్ మోహంతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి క్రిటిక‌ల్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదానికి ముందు భారీ శబ్దం విన్నానని  హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ తెలిపాడు.

Also read : Odisha Trains Crash : 100 శాతం గ్యారంటీ..అది విధ్వంస కుట్రే : మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది

ఇలాంటి ప్ర‌మాదాల విష‌యంలో లోకో పైలెట్ల‌తో ఎటువంటి సంబంధం ఉండ‌ద‌ని రైల్వే శాఖ చెబుతోంది. సిగ్న‌ల్ ఆప‌రేష‌న్లు సెక్ష‌న్ ఆఫీస‌ర్లు, సెక్ష‌న్ హెడ్స్‌, స్టేష‌న్ మాస్ట‌ర్ ఆధీనంలో ఉంటాయ‌ని ఓ రైల్వే అధికారి తెలిపారు.  కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గూడ్స్ రైలును లూప్ లైన్‌లో నిలిపి ఉంచారు. ఆ తర్వాత లూప్ లైన్‌లోకి ప్రవేశించడానికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గ్రీన్ సిగ్నల్ పొందిందని ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. అయితే లూప్ లైన్‌లో గూడ్స్ రైలును నిలిపి ఉంచి, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్నీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారనేది తేలాల్సి ఉంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో లోపమా? ఎవరైనా నిర్లక్ష్యంతో పొరపాటు చేశారా? అనేది తేలాలి.

  Last Updated: 06 Jun 2023, 07:21 AM IST