BIG BREAKING: టీడీపీ ఎమ్మెల్సీగా అనురాధ అనూహ్య విజయం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 175 మంది కూడా ఓట్లు వేశారు. అయితే చివరి వరకు ఒక్క ఓటుపై ఉత్కంఠ కనిపించింది.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 12:59 PM IST

BIG BREAKING: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 175 మంది కూడా ఓట్లు వేశారు. అయితే చివరి వరకు ఒక్క ఓటుపై ఉత్కంఠ కనిపించింది. 12 గంటల లోపే 174 ఓట్లు పోలవ్వగా, ఒక్క ఓటు పెండింగ్ ఉండడంతో అంతా ఆసక్తికరంగా మారింది.

అయితే ఆ ఓటు వేయని అభ్యర్థి విజయనగరం జిల్లా నెలిమర్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు అని తేలింది.ఇవాళ ఉదయమే తన కుమారుడి వివాహం ఉండడంతో ఆయన రావడం ఆలస్యం అయ్యింది. అయితే ఈ ఎన్నికలో ప్రతి ఓటు కీలకం కావడంతో అతడి కోసం ప్రత్యేక చాపర్ ను పంపించి ఓటు వేయడానికి రప్పించింది అధిష్టానం… దీంతో ఆయన వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ ముగిసింది.

ఏపీలో అసెంబ్లీ సీట్ల బలం ప్రకారం ఏడుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తూ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ పడిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఎన్నికల ఏకగ్రీవం అవుతుంది అనుకుంటే.. పోటీ తప్పలేదు. ఏదో విప్ పేరుతో తమ ఎమ్మెల్యేలను హెచ్చరించడానికి కాదు.. గెలిచే సత్తా ఉంది అని చెబుతూ టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది.