ఐపీఎల్ 2022వ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం… ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో గాయపడ్డ అన్రిచ్ నోర్జేను ఇంకా ఆ గాయం వేధిస్తునే ఉంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌తో పాటుగా భారత్ సిరీస్ కు తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్ కూడా అన్రిచ్ నోర్జే దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న నోర్జే తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 7.65 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. సహచరుడు రబడాతో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో తనవంతు పాత్రను పోషించాడు.
ఐపీఎల్-2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా యువ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‌తో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను ఆసీస్ సీనియర్ ఓపెనర్, డేవిడ్ వార్నర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టలో మొత్తంగా 24 మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో 17 మంది భారత ఆటగాళ్లు, 7మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరి కోసం మెగావేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు ఖర్చు చేసింది.