Site icon HashtagU Telugu

BIG BLOW To SRH: సన్ రైజర్స్ కు షాక్.. గాయాలతో ఆ ఇద్దరూ ఔట్

Sunriser

Sunriser

ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్‌ టైటాన్స్‌ను దెబ్బ తీసి విజయనందంలో ఉన్న సన్‌రైజర్స్‌ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గుజరాత్‌ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దాంతో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయకుండానే అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. తాజా సమాచారం ప్రకారం వాషింగ్టన్ సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ గాయం తీవ్రత దృష్ట్యా సుందర్ కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అలాగే ఇదే మ్యాచ్ లో హైద్రాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలి కండ‌రాలు ప‌ట్టేయడంతో మైదానంలో నొప్పితో బాధ పడ్డాడు. ఫిజియో వ‌చ్చి పరిశీలించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దాంతో రాహుల్ త్రిపాఠి రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఒకవేళ రాహుల్ త్రిపాఠి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే అతను రాబోయే మ్యాచులకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది. సన్రైజర్స్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ 42 పరుగులు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 57 పరుగులు చేసి అర్ధ శతకాలతో అదరగొట్టారు. అలాగే చివర్లో నికోలస్ పూరన్ 34 పరుగులు, మార్క్రమ్ 12 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.