బెంగళూరు జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నీల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా వెల్లడించనుంది. అంతకుముందు సన్‌రైజెర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కాల్టర్‌నైల్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కౌల్టర్ నైల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్‌లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ”తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్‌సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)” అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆసీస్ ఆటగాడికి బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే కెపాసిటీ ఉంది. అలాంటి ఆటగాడు దూరమవ్వడం రాజస్తాన్ రాయల్స్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.ఇక ఐపీఎల్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు రూ. 2 కోట్లు వెచ్చించి నాథన్ కౌల్టర్ నీల్‌ను దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్ లో కౌల్టర్ నీల్ 38 మ్యాచ్‌లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు.రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.