విజయ్ అంటోని హీరోగా నటించిన బిచ్చగాడు2 మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 4.10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తమిళనాడుతో సమానంగా తెలుగు వసూళ్లు ఉన్నాయని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 8.15 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని చెబుతున్నారు.
విజయ్ ఆంటోని ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చు పెట్టాడు. ఫస్టాఫ్ కి ఎక్కడా వంక బెట్టడానికి ఉండదు. సెకండాఫ్ లో మాత్రం ఒకటి రెండు చోట్ల కథనం కాస్త మందగిస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. వీకెండులో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల విడుదలైన మణిరత్నం మూవీ పొన్నియన్ సెల్వన్ కన్నా బిచ్చగాడు బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.