Site icon HashtagU Telugu

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ అరుదైన రికార్డ్

RCB Captaincy

RCB Captaincy

సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు. లీగ్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో భువి ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ శిఖర్ ధావన్ , లివింగ్ స్టోవ్, షారూఖ్ ఖాన్ లను ఔట్ చేశాడు. 4 ఓవర్ల స్పెల్ లో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

షారూఖ్ ఖాన్ వికెట్ తీయడం ద్వారా 150 వికెట్ల క్లబ్ లోకి చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్ గానూ, ఓవరాల్ గా మూడో పేసర్ గానూ రికార్డు సృష్టించాడు. భువి కంటే ముందు విండీస్ ఆల్ రౌండర్ డ్వయాన్ బ్రేవో (174) , లంక దిగ్గజం మలింగ (170) ఐపీఎల్ లో 150 వికెట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నారు. అటు స్పిన్నర్లు అమిత్ మిశ్రా (166), పియూష్ చావ్లా (157), చాహల్ (151), హర్భజన్ సింగ్ (150) ఈ మైలురాయిని సాధించిన వారిలో ఉన్నారు. భువనేశ్వర్ 138వ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ కెరీర్ లో భువి 25.16 సగటుతో 150 వికెట్లు తీసాడు. అత్యుత్తమ గణాంకాలను చూస్తే 19 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో భారత జట్టులో నిలకడగా చోటు దక్కించుకోలేకపోతున్న భువనేశ్వర్ ఈ ఐపీఎల్ లో మెరుగ్గా రాణిస్తేనే వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ టీమ్ లో చోటు దక్కించుకునే అవకాశముంటుంది.

Pic Courtesy- SRH/Twitter