భూపాల్ నాయక్ ..భూపాల్ నాయక్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తుంది. భారీగా బౌన్సర్లను వెంటేసుకొని..ఓ సినిమా హీరోలాగా జిల్లాలో పర్యటిస్తూ..నానా హడావిడి చేస్తున్నారు. ఈయన చేస్తున్న బిల్డప్ చూసి ఎవరా ఈ బిల్డప్ నాయక్ అని జిల్లా వాసులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
కిసాన్ పరివార సంస్థ నేతగా వారం రోజులుగా డోర్నకల్ నియోజకవర్గం (Dornakal Constituency)లో భూపాల్ నాయక్ పర్యటిస్తున్నారు. మంగళవారం నియోజవర్గ కేంద్రంలోని మున్నేరు వాగు శివారు శివాలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తను అనుచరులు, ప్రజలతో కలిసి ర్యాలీగా మున్సిపాలిటీ కేంద్రంలోని ముత్యాలమ్మ తల్లి ని దర్శించుకుని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ప్రధాన కూడాలిలో పలు దుకాణం దారులతో ముచ్చటించారు. అనంతరం రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన (Bhupal Naik ) మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయబోతున్నట్లు తెలిపాడు.
డోర్నకల్ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, కిసాన్ పరివార్ సంస్థ (Kisan Parivar) తరుపున వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అసలు నేను రాజకీయంలోనే రావొద్దని అనుకున్న కానీ డోర్నకల్ నియోజకవర్గ పరిస్థితి మరి దారుణంగా ఉందని అది చూసి..రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాని చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు రామచంద్రనాయక్, మాలోత్ నెహ్రూ నాయక్ నా మిత్రులే అని తెలిపాడు. నిన్నటివరకు భోపాల్ నాయక్ అంటే ఎవరికీ తెలియదు…సడెన్ వచ్చి కాంగ్రెస్ నుండి పోటీ చేయబోతున్న..మీ సపోర్ట్ కావాలని ప్రజలను అడగడం చూసి అంత అవాక్ అవుతున్నారు. ఇదంతా ఏమోకానీ ఈయన వెంట ఉన్న బౌన్సర్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఓ సినిమా హీరోల ఈ బిల్డప్ ఏంటి సామీ అని మాట్లాడుకుంటున్నారు.
Read Also: AP Volunteer: వివాహితను పెట్టుకెళ్ళిపోయిన వాలంటీర్: వైసీపీ రెబల్ ఎంపీ