Site icon HashtagU Telugu

MP : ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి వెళ్తోన్న బస్సును ఢీకొన్న లారీ… 14 మంది మృతి..!!

Mp

Mp

శనివారం ఉదయం మధ్యప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రేవాలోని సుహాగి కొండ సమీపంలో బస్సును లారీ  ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 40మంది తీవ్రంగా గాయాపడ్డారు. గాయపడిన వారిలో 20మందిని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని ఆసుపత్రిలో చేర్చారు. బస్సు హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తోన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదట ట్రక్కును ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో…అదే సమయంలో వెనక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులంతా అక్కడిక్కడే మరణించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా దీపావళి పండగ కోసం హైదరాబాద్ నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 100మంది ప్రయాణికులు ఉన్నారు.