Urination Incident-Singer : ఆ పెయింటింగ్ పోస్ట్ చేసినందుకు సింగర్ పై కేసు..అదేంటో చూడండి

Urination Incident-Singer : మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను అద్దం పట్టే పెయింటింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన భోజ్‌పురి సింగర్  నేహా సింగ్ రాథోడ్‌పై కేసు నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Urination Incident Singer

Urination Incident Singer

Urination Incident-Singer : మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను అద్దం పట్టే పెయింటింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన భోజ్‌పురి సింగర్  నేహా సింగ్ రాథోడ్‌పై కేసు నమోదైంది. సూరజ్ ఖరే అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా భోపాల్‌లోని హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 153(A) (మతం, జాతి మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం) కింద నేహా సింగ్ రాథోడ్‌పై అభియోగాలను నమోదు చేశారు. ఆమె  పోస్ట్‌ చేసిన పెయింటింగ్ లో అర్ధ నగ్నంగా ఉన్న ఒక  వ్యక్తి (బహుశా నిందితుడు ప్రవేశ్ శుక్లా).. మరో వ్యక్తి (బహుశా బాధితుడు దష్మేష్ రావత్‌) పై మూత్ర విసర్జన చేస్తున్నట్లుగా ఉంది. మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి (Urination Incident-Singer) తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్, తలపై నల్లటి టోపీలు ధరించి..  ఖాకీ షార్ట్‌ ను పక్కన పెట్టుకుని కనిపించాడు. ఈ వివాదాస్పద పోస్టుకు సింగర్  నేహా సింగ్ రాథోడ్‌.. “ఎంపీ మే కా.. బా..? (ఎంపీలో ఏమి జరుగుతోంది) త్వరలో వస్తుంది” అనే క్యాప్షన్ పెట్టారు.

Also read : Uniform Civil Code : జ‌గ‌న్ కు మోడీ అగ్నిప‌రీక్ష‌, ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుతో లొల్లి

https://twitter.com/nehafolksinger/status/1676820713905471488?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1676820713905471488%7Ctwgr%5Ecca9e5d640954b65c927f3cacd170863cc79bdd6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fbhojpuri-singer-neha-singh-rathore-twitter-post-booked-mp-urination-incident-man-rss-dress-2403216-2023-07-07

ఇదే ఏడాది ఫిబ్రవరిలో ‘యూపీ మే కా.. బా.. – సీజన్ 2’ టైటిల్ తో ఒక  పాటను రిలీజ్ చేసినందుకు నేహా సింగ్ రాథోడ్ కు యూపీ  పోలీసులు నోటీసు అందజేశారు. ఫిబ్రవరి రెండోవారంలో  యూపీలోని కాన్పూర్ దేహత్‌ జిల్లాలో అధికారులు ఆక్రమణల తొలగింపు డ్రైవ్ చేసే క్రమంలో ఇద్దరు మహిళలు (తల్లీ-కూతురు) గుడిసెలో సజీవ దహనమయ్యారు. అధికారులను అడ్డుకునేందుకు వాళ్లిద్దరూ (మహిళ, ఆమె కుమార్తె) గుడిసెలో తమను తాము కాల్చుకున్నారని కొందరు అంటారు. బుల్డోజర్‌ తగలడంతో జనరేటర్‌ కిందపడి అందులోని డీజిల్‌ మంటలకు గుడిసె దగ్ధమైందని ఇంకొందరు చెబుతారు. దీనిపై అప్పట్లో వెంటనే స్పందించిన  నేహా సింగ్ రాథోడ్‌.. “ఎంపీ మే కా.. బా..? పాటను పాడింది.

  Last Updated: 07 Jul 2023, 04:19 PM IST