పవర్ స్టార్ పవన్ కళ్యణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరెకెక్కుతున్న చిత్రం ‘బీమ్లానాయక్’ జనవరి12న విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాగాజా ఈ చిత్రం గురించి ఓ అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సన్నివేశాలు ఇంకా కొన్ని చిత్రీకరించాల్సి ఉండగా షూటింగ్ మొదలు పెట్టినట్టు చిత్ర బృందం తెలిపింది. పవన్ కళ్యాణ్ కూడా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దగ్గుబాటి రానా, పవన్ కళ్యాణ్ మధ్య కీలక సన్నివేశాలను వికారాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ తో పవన్ కళ్యాణ్, రానా చిత్ర ప్రియులను ఆకట్టుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి త్రివిక్రమ్ మాటలు రాయగా .. నిత్య మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Cinema: ‘బీమ్లానాయక్’ ఆప్డేట్.. రానా, పవన్ సన్నివేశాలు చిత్రీకరణ

Template (11) Copy