Chandrashekhar Azad: ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం

Chandrashekhar Azad: ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం అతని కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతని పొత్తికడుపులో బుల్లెట్ దూసుకుపోయింది. వైద్య చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై డాక్టర్లు నిర్ధారణకు రావాల్సి ఉంది. ఈ ఘటన దేవబంద్ పట్టణంలో చోటుచేసుకుంది. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆజాద్ మాట్లాడుతూ..నాకు బాగా గుర్తులేదు కానీ నా ప్రజలు వారిని గుర్తించారు. వారి కారు సహరాన్‌పూర్ వైపు వెళ్లింది. మేము U-టర్న్ తీసుకున్నాము. సంఘటన జరిగినప్పుడు మా తమ్ముడితో సహా ఐదుగురు కారులో ఉన్నామని తెలిపాడు.

Read More: Deceased Persons Items: మరణించిన వ్యక్తి వస్తువులు ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?