కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మార్చి 25ను లాక్ చేయగా, తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఈ మల్టీస్టారర్ మూవీ రెండు తేదీలను బ్లాక్ చేసింది. మీ అందరి కోసం థియేటర్లలో ప్రదర్శించడానికి మహమ్మారి తగ్గే వరకు మేము వేచి ఉండాలి. పరిస్థితి మెరుగుపడితే 25 ఫిబ్రవరి, 2022 లేదా ఏప్రిల్ 1, 2022న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాము.” అంటూ భీమ్లానాయక్ టీం ప్రకటించింది.
Bheemla Nayak Update: భీమ్లానాయక్ రిలీజ్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1
