Site icon HashtagU Telugu

Bheemla Nayak: భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక మిగిలింది రికార్డులే..!

bheemla nayak

bheemla nayak

పవర్ స్టార్ పవన్​ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా… శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూబైఏ(U/A) సర్టిఫికెట్​ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ‘భీమ్లా నాయక్’ సినిమాకు సంబంధించిన నిడివి 2 గంటల 25 నిమిషాలు ఉంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ కు రీమేక్‌ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి… మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. తమన్‌ అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. పవన్​ కు ప్రత్యర్థి పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. నిత్యమేనన్, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ తెలుగుతో పాటు హిందీలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘భీమ్లా నాయక్’ ఫీవరే కనిపిస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి మాస్ జాతర షురూ కానుంది.