Singareni: సింగరేణిపై భట్టి కీలక నిర్ణయం, త్వరలో ఆ పోస్టుల భర్తీ

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 06:37 PM IST

Singareni: సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ పో స్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్‌నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారు ణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇత ర అధికారులతో డిప్యూటి సిఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలని, పరీక్ష ల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్భందీగా ఉం డాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.