Site icon HashtagU Telugu

Bharat: జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ నేమ్​ప్లేట్​పై ఇండియాకి బదులుగా “భారత్”..!

Bharat

Compressjpeg.online 1280x720 Image 11zon

Bharat: ప్రధాని నరేంద్ర మోదీ స్వాగత ప్రసంగంతో జీ20 సదస్సు (G20 Summit) ప్రారంభమైంది. ప్రస్తుత జి20 అధ్యక్షుడిగా భారతదేశం (Bharat) ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. దీని తర్వాత బ్రెజిల్ ఈ బాధ్యతను చేపట్టనుంది. జి-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేమ్​ప్లేట్​పై ‘భారత్'(Bharat) అనే పదాన్ని ఉపయోగించారు. ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో జీ-20 సదస్సు ప్రారంభోపన్యాసం సందర్భంగా ప్రధాని మోదీ ముందు ఉంచిన ప్లేట్‌పై భారత్‌ అని రాశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇండియా అనే పదం వివాదం దీనికి మరింత ఆజ్యం పోసింది. దీనితో ఇండియా పేరును భారత్‌గా మార్చవచ్చనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఇండియా పేరును భారత్​కు మార్చాలని కేంద్రం యోచిస్తోందన్న ఊహాగానాలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

గతంలో ప్రతి జీ-20 సమావేశంలో ఇండియా అని మాత్రమే కనిపించేది. కానీ భారతదేశం అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న జీ20 సదస్సులో మాత్రం ‘భారత్’ అనే పదాన్ని ఉపయోగించారు. జీ20 సదస్సు ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఇండియా పేరు మారుతుందన్న ఊహాగానాల మధ్య ఆయన ముందు ‘భారత్’ అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ స్పష్టమైన సంకేతం ఇస్తోంది.

Also Read: G20 Summit: జీ20 సదస్సు ప్రారంభం.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్.. ఇదే మార్గదర్శక సూత్రమన్న ప్రధాని మోదీ

వాస్తవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రపంచ నేతలకు పంపిన ఆంగ్ల భాషా ఆహ్వానంలో ఇండియాకి బదులుగా భారత్ అని రాయాలని నిర్ణయించడం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ కారణంగానే ఈ నెలాఖరులో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యం ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రయత్నాన్ని లాంఛనంగా చేయడమేనన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.