భారత్ ముక్తి మోర్చా 12వ, వెనుకబడిన, మైనారిటీవర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్ ఖారత్ ఆహ్వానించారు. బుధవారం హైదరాబాదులో భారత్ ముక్తి మోర్చా, వెనుకబడిన, మైనారిటీవర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) ప్రతినిధులు కల్వకుంట్ల కవితను కలిశారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రమ్ నేతృత్వంలో ఈ రెండు సంస్థల జాతీయ సదస్సులు జరగనున్నాయి. ముక్తి మోర్చా ఆహ్వానం మేరకు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవ్వడానికి కల్వకుంట్ల కవిత అంగీకరించారు.
MLC Kavitha: కవితకు భారత్ ముక్తి మోర్చ ఆహ్వానం!

Mlc Kavitha