Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra 2.0: త్వరలో భారత్ జోడో, ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ యాత్ర

Bharat Jodo Yatra

Bharath Jodo Yatra

ఏదైనా అద్భుతం జరుగాలంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదు. అణు విస్పోటనంగా పెద్ద ప్రయత్నమే చేయాలంటారు పెద్దలు. ఈ మాటలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అతికినట్టుగా సరిపోతాయి. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ, భారత ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చేలా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. కర్నాటక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీలో మంచి ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గెలుపు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. నవంబర్-డిసెంబర్లో తెలంగాణా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్లో ఎన్నికలు జరగాల్సుంది. వీటిల్లో పెద్ద రాష్ట్రాలు కాబట్టే తెలంగాణా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ మీదే అందరి దృష్టి ఉంది.

యాత్ర చేయటానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. అందుకనే యాత్ర ప్రారంభం, రూటుమ్యాప్ తదితరాలపై దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని సీనియర్ నేతల కమిటి సమావేశమైంది. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోగానే భారత్ జోబోయాత్ర-2.0ని మొదలుపెట్టాలని కమిటి సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలి విడత భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైంది. 136 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర జమ్మూ-కశ్మీరులో ముగిసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉత్తర

Also Read: Bhatti Vikramarka: కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యామ్ లు కొట్టుకుపోయాయి : భట్టి విక్రమార్క