Site icon HashtagU Telugu

Bharat Biotech : భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ కు అనుమితిచ్చిన డీసీజీఐ

Bharath Biotech Imresizer

Bharath Biotech Imresizer

క‌రోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు భార‌త్ బ‌యోటెక్ మ‌రో వ్యాక్సిన్ ని రూపొందించింది. ముక్కు ద్వారా ఇచ్చే చుక్క‌ల మందుకు డీసీజీఐ నుంచి అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి ల‌భించింది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్‌ సమర్థంగా కొవిడ్‌ను ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.