Murder: బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడుకుని ఓ తండ్రి కొట్టి చంపిన సంఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని మెదక్ – చిన్న శoకరంపేట మండలం బగిరాత్ పల్లిలో బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. రైల్వే ఉద్యోగి ముకేశ్ కుమార్(28). బెట్టింగ్‌లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, నిన్న అర్ధరాత్రి ముఖేశ్‌ను కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ ఉండటంతో యువత బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు పొగొట్టుకొని విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
మరో ఘటనలో వడ్డీ పేరుతో హత్య జరిగింది. వడ్డీలు చెల్లించినా వేదింపులు ఆగక పోవడంతోనే.. ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని సాఫ్ట్ వేర్ ఫ్యాకల్టీ హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు మధురానగర్ పోలీసులు. సినీ ప్రొడక్షన్ మేనేజర్ చంద్ర మౌళి అలియాస్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రూ 5 లక్షల అప్పుకు 15 లక్షలు వడ్డీ.. అసలు రూ.3 లక్షల కోసం పలు మార్లు అడగడంతో హత్య జరిగింది.