Site icon HashtagU Telugu

Eating Habits: రాత్రి ఈ సమయానికి తింటే మంచిదని మీకు తెలుసా…?

Food

Food

Best Time to eat : రాత్రి నిద్రించడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని చెబుతుంటారు. తొందరగా భోజనం ముగించేసి..వెంటనే స్నాక్స్ లాంటివి తినేసి…ఆ వెంటనే నిద్రపోవాలనుకుంటే…మోతాదుకు మించి తినడం వల్ల వచ్చే ఆయాసంతో నిద్ర పట్టదు. నిద్రలేమికి గురికాక తప్పదు. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా ఊబకాయానికి సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే తొందరగా భోజనం ముగించేస్తారో అప్పుడే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అంతేకాదు మీరు రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు…వాటి క్యాలరీలు ఎంత ఉంటున్నాయో మీరు తెలుసుకోవడం చాలా అవసరం.

అయితే మీ శరీరాన్ని ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు భోజనం మానేయడం సరికాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనం మానడం అనేది మరింత హాని చేస్తుంది. చాలామంది రాత్రి భోజనం చేయకుండా బరువు తగ్గొచ్చు అనుకుంటారు. కానీ అది పొరపాటు. రాత్రి భోజనం చేయకపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఎక్కువ ఆకలిగా ఉటుంది. దాంతో ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారి తీస్తుంది. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

రాత్రి సమయంలో తొందరగా భోజనం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలసుకుందాం…

బరువు అదుపులో ఉంటుంది…
మీ శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవాలంటే..రాత్రుల్లో త్వరగా భోజనం చేయడం మంచిది. తొందరగా భోజనం చేసేటప్పుడు అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. భోజనం ముగించాక కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేస్తే అదనపు క్యాలరీలను కరిగించుకోవచ్చు.

అసిడిటీ సమస్య ఉండదు…
అర్దరాత్రి దాటక తినడం…వెంటనే నిద్రపోవడం, భోజనం సమయంతోపాటు నిద్ర సమయం కూడా మారిపోతుంది. మొత్తంగా మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. దీంతో హార్ట్ బర్నింగ్ ప్రాబ్లమ్ తో బాధపడాల్సి వస్తుంది. అందుకే అసిడిటి వంటి సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే రాత్రిళ్లు త్వరగా భోజనం చేయడం మంచిది.

తేలికగా అనిపిస్తుంది…
రాత్రి సమయంలో భోజనం తొందరగా చేయడం వల్ల పొట్ట లైట్ గా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్య ఉండదు. త్వరగా భోజనం చేయడం వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం ఇది.

బాగా నిద్రపడుతుంది…
రోజంతా ఆఫీస్ పని, ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వీటినుంచి రిలాక్స్ పొందాలంటే తొందరగా నిద్రపోవాలి. అంతే త్వరగా భోజనం చేసి నిద్రపోవాలి. ఇలా చేస్తే లేటుగా నిద్రపోయే అవకాశం ఉండదు. కాబట్టి రాత్రి భోజనం చేసేందుకు, పడుకునేందుకు టైమ్ ను షెడ్యూల్ చేసుకోవడం మంచిది.