Site icon HashtagU Telugu

MS Dhoni Retirement: రిటైర్మెంట్ కు ఇదే మంచి టైం…కానీ.. మనసులో మాట చెప్పిన ధోనీ

MS Dhoni Retirement

Whatsapp Image 2023 05 30 At 10.36.59 Am

MS Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ రిటైర్మెంట్ పై గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గత సీజన్ లో చెన్నై కనీసం ప్లే ఆఫ్ కు వెళ్లకపోవడంతో ధోనీ రిటైర్మెంట్ ఖాయమే అనుకున్నారు. అయితే జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో…మళ్లీ పగ్గాలు అందుకున్న ధో కునీ ఈ సీజన్ లో జట్టును నడిపించాడు. మళ్లీ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న ప్రచారం మొదలయింది. దీంతో ఫాన్స్ చివరి సారి ధోనీని గ్రౌండ్ లో చూసేందుకు ఎగబడ్డారు. చెన్నై కూడా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకోవడంతో కప్ గెలిచి ధోనీ వీడ్కోలు ప్రకటిస్తాడని భావించారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

ఫైనల్లో చెన్నై చివరి బంతికి విజయం సాధించి మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయం అనంతరం ధోనీ ఎమోషనల్ అయ్యాడు.సాధారణంగా భావోద్వేగాలని బయటకు కనిపించని ధోనీ ఈ మ్యాచ్ తర్వాత చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. మొదటి ప్రశ్నలోనే తన రిటైర్మెంట్ గురించి చెప్పేశాడు.

పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్‌మెంట్(Retirement) తీసుకోవడానికి ఇదే సరైన టైం అని ధోనీ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఏమన్నాడంటే ఒక విధంగా చూస్తే రిటైర్‌మెంట్ తీసుకోవడానికి ఇది బెస్ట్ టైం. థాంక్యూ అని చెప్పేసి రిటైర్ అవడం నాకు ఇప్పుడు చాలా ఈజీ. కానీ మరో 9 నెలలు కష్టపడి ఇంకొక్క సీజన్ ఆడటం కష్టమైన పని. శారీరకంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ సీఎస్కే అభిమానులు నాపై చూపించిన ప్రేమను చూస్తే.. వాళ్ల కోసం మరొక్క సీజన్ ఆడాలని ఉందన్నాడు.

ఇది తన కెరీర్‌లో చివరి దశనీ, అది ఇక్కడే మొదలైందన్నాడు. స్టేడియం అంతా తన పేరు పిలుస్తోందనీ , చెన్నైలో కూడా ఇలాగే ఉందన్నాడు. ఇంకొక్కసారి మైదానంలో దిగి నేను ఆడగలిగినంత ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాననీ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్ లో తన ప్లేయర్స్ అందరూ చక్కగా ఆడారని ప్రశంసించాడు. కాగా రిటైర్మెంట్ పై ధోనీ చేసిన తాజా కామెంట్స్ తో చెన్నై ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More: IPL FINAL Winner: ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఉత్కంఠ పోరులో నెగ్గి టైటిల్ కైవసం..!