Site icon HashtagU Telugu

Viral Video: ఉడుతల దోస్తు.. వీడియో జబర్దస్తు!!

Squirrel

Squirrel

ఉడుతా ఉడుతా ఊచ్.. అంటే అవి వింటున్నాయి. తమను పెంచే డెరిక్ డౌనీ జూనియర్ మాటలను తు. చ తప్పకుండా పాటిస్తున్నాయి. చేతితో చెర్రీలు వేస్తే తింటున్నాయి.. నీళ్లు ఇస్తే తాగుతున్నాయి.. కెమెరా వైపు చూడమంటే చూస్తున్నాయి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈనెల 16న పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దానికి 8.3 లక్షల వ్యూస్, 72వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఒక ఉడతను “రిచర్డ్” అని పిలవగానే.. పరుగెత్తుకుంటూ డెరిక్ డౌనీ వద్దకు రావడం ఈ వీడియో లో వెరీ వెరీ స్పెషల్. అతడు చేతిలో పట్టుకున్న గ్లాసులోకి ఉడుత నోటిని పెట్టి.. నీటిని తాగే దృశ్యం అబ్బురంగా కనిపిస్తుంది.

ఈ వీడియో ను చూసిన నెటి జన్స్ ఎన్నో కామెంట్స్ పెట్టారు.” బెస్ట్ స్క్విరెల్ డ్యాడ్” అని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ఉడుతలు మనుషులతో ఎంతో ఫ్రెండ్లీ గా ఉంటాయి. త్వరగా వాటిని మచ్చిక చేసుకోవచ్చు. చాలా ఆఫ్రికా, అరబ్ దేశాల ఇళ్లలో ఉడుతలను పెంచుకోవడం సర్వ సాధారణం.