Site icon HashtagU Telugu

Food: శరీరం బలహీనంగా ఉందా.. అయితే ఈ ఆహార పదార్థాలను తినాల్సిందే?

Enegry Levels

Enegry Levels

ప్రస్తుత కాలంలో మనుషులు బిజీబిజీ షెడ్యూల్ ల వల్ల సరిగ్గా భోజనం చేయడం లేదు. అంతేకాకుండా మారిన ఆహారపు అలవాట్లతో సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవడం లేదు.

దీనితో శరీరం అలసిపోతోంది. అయితే మనిషి కష్టపడి పని చేయాలి అంటే ముఖ్యంగా శరీరంలో సత్తువ ఉండాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో అయితే మనుషులు శరీరం పై కంటే ఎక్కువగా పనులపై శ్రద్ధగా చూపిస్తున్నారు. దీనితో శరీరం తగిన ఆహారం, విశ్రాంతి లేకపోవడంతో బలహీనపడుతోంది.

మరి శరీరంలో సత్తువ ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనం నిత్యం తినే వాటితో పాటుగా మరికొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరం కోల్పోయిన సత్తువను తిరిగి తెచ్చుకోవచ్చు. అటువంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బెర్రీ పండ్లు: రేగు పళ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, క్రాన్‌ బెర్రీస్ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లు మంచి పోషకాలు కలిగిన పండ్లు అని చెప్పవచ్చు. ఈ బెర్రీ పండ్లలో విటమిన్ సి, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

క్రూసిఫెరస్ వెజిటబుల్స్‌: ఆకుపచ్చగా ఆకుల తరహాలో ఉండే గ్రీన్‌ లీఫీ కూరగాయలతో శరీరానికి కావలసినంత శక్తి అందుతుందట. బ్రకొలీ, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, కేల్‌ వంటివి క్రూసిఫెరస్ కూరగాయల్లో ప్రోటీన్లు, ఇనుము, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,ఉండే పోషకాలు శరీరానికి మంచి సత్తువను ఇస్తాయి.

సోయాబీన్స్: సోయాబీన్స్‌.. శాకాహారంలో మనకు ఎక్కువగా ప్రోటీన్లను అందించే వాటిలో ప్రధాన పోషకాహారం సోయాబీన్‌. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికీ కావాల్సినంత శక్తి చేకూరుతుంది.

గింజలు, డ్రైఫ్రూట్స్‌ : మనం తరచుగా తినే వాటిలో డ్రైఫ్రూట్స్‌, వివిధ రకాల గింజలను స్నాక్స్‌ గా తీసుకుంటే శరీరానికి మంచి శక్తిని ఇస్తాయట. మరి ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్‌ నట్స్‌ వంటివి శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి.

కాఫీ: కాఫీలో ఉండే కెఫీన్ అనే రసాయనం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరనను వేగవంతం చేసి, మెదడు పనితీరును కూడా ఉత్తేజితం చేస్తుంది. అలా అని మరీ పరిమితికి మించి కాపీలు తాగడం మంచిది కాదు.

గ్రీన్ టీ: శరీర సత్తువను వేగంగా పెంచడానికి గ్రీన్‌ టీ కూడా తోడ్పడుతుంది. దీనిలి కూడా కెఫీన్‌ అనే రసాయనం ఉంటుందని దానికి అదనంగా జీవ క్రియలు సాఫీగా సాగేందుకు తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట.

నిమ్మ, నారింజ జాతి పండ్లు: నారింజ, నిమ్మకాయలు, ఆ జాతి పండ్లు కూడా శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం వంటి సమయంలో ఇవి బాగా ఉపకరిస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

చేపలు: చేపలు ఎన్నో రకాల పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ముఖ్యంగా ప్రొటీన్ లతో పాటు విటమిన్ బీ కూడా ఎక్కువ. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

అరటి పండ్లు: అరటిపండ్లు తరచుగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్, పొటాషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.