Site icon HashtagU Telugu

Eye: కంటి ఒత్తిడిని తగ్గించే బెస్ట్ వ్యాయామాలు ఇవే…!!

Eye Exercise Imresizer

Eye Exercise Imresizer

కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉద్యోగులంతా కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ కొత్త పని నిబంధన వల్ల మనలో చాలామంది కంప్యూటర్లకు అతుక్కుపోయేవారే ఉన్నారు. వర్క్ ఫ్రం హోం కావడంతో కంపెనీలు పని సమయాన్ని పొడగించాయి. దీంతో ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తునే గడపాల్సి వస్తోంది. అయితే డిజిటల్ డివైసుల నుంచి మన ద్రుష్టిని మరల్చేందుకు సరైన మార్గాలు లేవు. ఇంట్లో సరైన వసతులు లేకపోవడంతో ఇతర వాటిపై ద్రుష్టిని మరల్చేము. దీంతో కళ్లు ఒత్తిడి గురవుతున్నాయి. కంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ఎక్కువ సమయం స్క్రీన్ చూడటానికే కేటాయించడం వల్ల ఏర్పడే ఒత్తిడిని అధిగమించాలంటే ఈ ఐ యోగా ఒక గొప్పమార్గమని చెప్పవచ్చు.

కంటి ఒత్తిడిని, అలసటను తగ్గించుకోవడానికి మీరు ఇంట్లోనే చేసే ఐదు కంటి వ్యాయామాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. భ్రమరీ ప్రాణామాయం…

ఈ వ్యాయామం ఎలా చేయాలంటే….
మీకు సౌకర్యంగా ఉన్న స్థలంలో నిటారుగా రిలాక్స్డ్ భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు మీ చూపుడు వేళ్లతో చెవులను మూసివేసి…మోచేతులను ఇరువైపులా కొద్దిగా పైకి లేపండి. తేనెటీగను అనుకరిస్తున్నట్లుగా బిగ్గరగా హమ్ చేస్తూ గాలి పీల్చుతూ నెమ్మదిగా వదిలివేయండి.
2. కన్ను రెప్పవేయడం, మూయడం…
అరచేతులు వేడెక్కినట్లుగా అనిపించేంత వరకు వాటిని రద్దండి. తర్వాత అరచేతులను కళ్లపై పది సెకన్లపాటు ఉంచండి. తర్వాత అరచేతులను తీసివేయండి. కళ్లను పైకి, క్రిందికి, ఎడమకు , కుడికి మరియు ముందుకు చూస్తున్నట్లుగా బ్లింక్ చేయండి. ప్రతి దశలోనూ పది సార్లు బ్లింక్ చేయండి.

3. కంటి కదలికలు….
మీకు సౌకర్యవంతంగా ఉన్న స్థలంలో నిటారు భంగిమలో రిలాక్స్డ్ గా కూర్చోండి. వెన్నుముకను నిటారుగా ఉంచి…పైకప్పు వైపు చూసి రెప్పవాల్చండి. మీ ముక్కును చూడండి. రెప్పపాటు ఎడమవైపు, కుడివైపు చూసి రెప్పవేయండి. కళ్లను సవ్యదిశలో తిప్పుతుండండి.
4. చేతి కదలికలతో కంటి కదలికలు మార్చుతుండాలి….
నిటారు భంగిమలో రిలాక్స్డ్ గా కూర్చోవాలి. బొటనవేలును థంబ్స్ అప్ పొజిషన్లో మీ చేతి రెండు వేళ్లను నేరుగా ముందుకు చాచండి. మీ చేతికి భుజానికి అనుగుణంగా ఉండే వరకు కుడివైపుకి జరుగుతున్నప్పుడు బొటనవేలు వైపు చూపును మళ్లించండి. ఇప్పుడు చేతిని తిరిగి మధ్యలోకి తీసుకోండి. ఎడమ చేతిని కూడా ఇలాగే చేయండి.
5.త్రాటక…
మీ నుంచి రెండు అడుగుల దూరంలో ఒక వస్తువుపై కొవ్వొత్తిని ఉంచండి. శ్వాసను తీస్తుండాలి. కళ్ల నుంచి నీరు వచ్చేంత వరకు వీలైనంత ఎక్కువ సేపు రెప్పవేయకుండా ముందున్న వస్తువుపై ద్రుష్టికి కేంద్రీకరించండి. ఇలా చేయడం వల్ల కంటి ఒత్తిడి దూరం అవుతుంది.

ఈ కంటి వ్యాయామాలు రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. ఈ వ్యాయామాలు మీ కంటి కండరాలను యాక్టివ్ గా ఉంచేలా సహాయపడతాయి. అంతేకాదు పని చేసి అలసిపోయిన కళ్లకు ఈ వ్యాయామాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి.

Exit mobile version