Site icon HashtagU Telugu

Bengaluru: దారుణం.. ప్రెషర్ కుక్కర్ తో భాగస్వామిని చంపిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Bengaluru

Bengaluru

తాజాగా బెంగళూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపాడు దుర్మార్గుడు. అందుకు గల కారణం అనుమానం అని తెలుస్తోంది. జీవితాంతం కలిసి తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన వ్యక్తి ప్రెషర్ కుక్కర్ తో తలపై బాది మరీ దారుణంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే.. దేవా అనే 24 ఏళ్ళ వైష్ణవ్‌ అనే 29 ఏళ్ళ అబ్బాయి ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు.

చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఒక మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఒక రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్ ప్రియురాలు దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు.

అయితే అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చిన దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ప్రేమించి సహజీవనం చేస్తున్న వైష్ణవ్ ప్రియురాలికి అండగా ఉండాల్సింది పోయి ఆమెను చంపి కటకటాల పాలయ్యాడు.