Site icon HashtagU Telugu

Delhi: టేకాఫ్‌కు ముందు ఇండిగో విమానంలో మంట‌లు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

indigo plane

indigo plane

ఢిల్లీలో ఇండిగో విమానం టేకాఫ్‌కు ముందు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. డిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌ ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 184 మందితో బెంగళూరుకు బయలుదేరిన A320 విమానం ఆ తర్వాత తిరిగి బేలోకి చేరుకుంది. ప్ర‌యాణికుల‌ను సురక్షితంగా దింపివేశారని ఎయిర్‌ఫోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణీకులందరికీ ప్రత్యామ్నాయ విమానంలో త‌ర‌లిస్తున్నామ‌ని ఇండిగో పేర్కొంది. ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంపై విమానాశ్రయంలోని కంట్రోల్ రూమ్‌కు CISF కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా దింపివేశారని వారు తెలిపారు.