Site icon HashtagU Telugu

Tiger Death : హైద‌రాబాద్ జూలో “రాయల్ బెంగాల్ టైగర్” మృతి

tiger

tiger

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో బుధవారం రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. ‘జో’ అనే 10 ఏళ్ల మగ రాయల్ బెంగాల్ టైగర్ తెల్లవారుజామున 3 గంటలకు తన ఎన్‌క్లోజర్‌లో చనిపోయిందని జూ క్యూరేటర్ తెలిపారు. గత ఆరు నెలలుగా బెంగాల్ టైగ‌ర్ చికిత్స పొందుతుంది. పోస్ట్‌మార్టం పరీక్షలో బిగ్ క్యాట్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో మరణించినట్లు తేలింది. పులి అజీర్ణం, ఆకలి లేకపోవడంతో బాధపడుతోంద‌ని క్యూరేట‌ర్ తెలిపారు. నిపుణుల ద్వారా చికిత్స అందించి.. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా బెంగాల్ టైగర్ ఏప్రిల్ 5, 2023 తెల్లవారుజామున 03.00 గంటలకు మ‌ర‌ణించింది. దశాబ్దం క్రితం సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన అబ్దుల్లా అనే 15 ఏళ్ల మగ చిరుత మార్చి 25న గుండెపోటుతో మరణించింది. తాజాగా ఇప్పుడు బెంగాల్ టైగ‌ర్ మ‌ర‌ణించింది.

Exit mobile version