Site icon HashtagU Telugu

Vastu: రహస్యంగా చేసే దానం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?

Secret Helping

Secret Helping

మామూలుగా మన ఇంట్లో పెద్దవారు దానధర్మాలు చేయాలి అని చెబుతూ ఉంటారు. హిందువులు దానం ధర్మం చేయడం కంటే గొప్పది ఏదీ లేదని భావిస్తూ ఉంటారు. మనకు ఉన్నంతలో దానధర్మాలు చేయడం వల్ల ఆ దేవుడి కృప ఆశీస్సులు మనపై ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అయితే హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి దానధర్మాలు చేస్తాడు. దానధర్మాలు చేస్తూ దేవతలు కూడా సంతోషిస్తారు. హిందూమతంలో దాన ధర్మం అని నమ్ముతారు.

పేదలకు సహాయంగా దాతృత్వం అందించబడుతుంది.నాకు దానం చేయడం వల్ల పేదరికం నుంచి కూడా బయట పడతారు. అయితే అన్ని దానాల కన్నా రహస్యదానం గొప్పది. రహస్యంగా దానధర్మాలు చేసే వారు ఎప్పుడూ కూడా తన గుర్తింపును ఇతరులకు వెల్లడించడు. తాను దానం చేసినట్టుగా తెలియకుండా దాచి పెట్టి మరి దానధర్మాలు చేస్తూ ఉంటాడు. మరి వాస్తు శాస్త్ర ప్రకారం రహస్య దానం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన దానం నీటి దానం అని చెప్పవచ్చు.

ఈ సమయంలో మండే వేడిగా ఉంది మరియు అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ దానిని పొందాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితిలో, నీటి రహస్య దానం ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని మార్చగలదు. కాబట్టి ఇందుకోసం మనుషులకు అవసరమైన ప్రతి చోట కూడా కుండలో నీటిని ఉంచడం ఎంతో మేలు. అదేవిధంగా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని దానంగా ఇవ్వడం గొప్ప పుణ్యంగా చెప్పవచ్చు. ఆకలితో బాధపడుతున్న వారికి లేదంటే ఆలయ ప్రదేశంలో లేదంటే ఇతర బయట ప్రదేశాలలో ఎక్కడైనా కనిపిస్తే వారికి ఆహారం దానంగా ఇవ్వడం ఎంతో మంచిది. ఒకవేళ మీరు కనుక రహస్య దానం చేయాలి అనుకుంటే మీ గుర్తింపుని తెలియజేయండి. ఆకలితో ఉన్న వారి కడుపు నింపితే మహాలక్ష్మి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బెల్లాన్ని కూడా దానం చేయవచ్చు. బెల్లాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి.