Site icon HashtagU Telugu

Wife Love: రియల్ బిచ్చగాడు…వైరల్ వీడియో..!!

Beggar Motorcycle

Beggar Motorcycle

ఆ దంపతులిద్దరికీ రోజువారీ భిక్షాటనే జీవనోపాధి. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా కేంద్రంలో వీరు ట్రై సైకిల్ ద్వారా భిక్షాటన చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. సంతోష్ కుమార్ సాహుకు వైకల్యం ఉంది. అందుకే అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే…అతని భార్య వెనకనుంచి నెట్టేది.

ఆలయాలు, మసీదుల దగ్గర వీరు అడుక్కునేవారు. వారి వయస్సు పెరగడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఎత్తైన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో సాహు భార్యకు నడుం నొప్పి వేధిస్తోంది. ఆమె నొప్పితో నరకాన్ని అనుభవించేది. అది చూడలేకపోయాడు సాహు. ఇంతకాలం అడుక్కుని కూడబెట్టుకున్న సొమ్ముతో త్రిచక్ర మోటార్ మోపెడ్ కొనుగోలు చేశాడు. రూ. 90,000ఖర్చు అయ్యింది. దీంతో తన భార్యకు వాహనాన్ని తోసే పని తప్పింది. ఇద్దరు కలిసి సులభంగా ఎక్కడికైనా చేరుకుని భిక్షాటన చేసుకుంటున్నారు. అయితే ఈ బైక్ వచ్చినప్పటి నుంచి తాము సియోని, ఇటార్సీ, భోపాల్, ఇండోర్ ప్రాంతాలకు వెళ్లి అడ్డుక్కోగలుగుతున్నట్లు చెబుతున్నారు. వీరి రోజువారీగా గతంలో 3 వందల నుంచి 4వందల వరకు సంపాదన ఉండేది.