Site icon HashtagU Telugu

Karthikeya : సినీ లవర్స్ కు షాక్ ఇచ్చిన ‘బెదురులంక 2012 ‘

Bedurulanka 2012 is now streaming on OTT

Bedurulanka 2012 is now streaming on OTT

కరోనా తర్వాత సినీ లవర్స్ అంత ఓటిటి కి అలవాటుపడ్డారు. థియేటర్స్ కు వెళ్లి వేలు ఖర్చు చేసే బదులు ఏంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీ సభ్యులతో కలిసి సినిమాలు చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వచ్చిన ఒకటి , రెండు రోజులు తప్పితే థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం లేదు. ఇక సినిమా కు నెగిటివ్ టాక్ వస్తే రిలీజ్ రోజే ఆ ఎఫెక్ట్ థియేటర్స్ లలో కనిపిస్తుంది. దీంతో చాలామంది నిర్మాతలు ఓటిటి సంస్థలకు ముందే తమ సినిమాల రైట్స్ ను అమ్మేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

ఇక ఓటిటి సంస్థలు సైతం సినిమా విడుదలై నెల కాకముందే స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా RX100 ఫేమ్ కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012 ‘ మూవీ విడుదలై నెల రోజులు కాకముందే ఓటిటి లో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. RX100 మూవీ తో యూత్ ను ఆకట్టుకున్న కార్తికేయ (Kartikeya) నుండి వచ్చిన తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka 2012). 2012లో యుగాంతం కాన్సెప్ట్‌తో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ మూవీ తెరకెక్కింది. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also : Oscar Entries: ఆస్కార్ రేసులో బలగం.. నాని దసరా మూవీ కూడా!

RX100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ మొదటి సినిమా రేంజ్ లో మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. ఆ మధ్య విలన్ గా కూడా ట్రై చేసాడు. నాని , అజిత్ మూవీస్ లలో విలన్ రోల్ చేసినప్పటికీ అవికూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో బెదురులంక 2012 మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఈ మూవీ కూడా కార్తికేయను నిరాశ పరిచింది. మొదటి రోజు మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన దక్కించుకొంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొద‌లైంది. సడెన్ గా ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ కావ‌డంతో సినీ ప్రియులు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.