Site icon HashtagU Telugu

Bear: దారుణం: దంపతుల్ని చంపి ఐదు గంటల పాటు శవాల్ని పీక్కుతిన్న ఎలుగుబంటి!

Dlygpqyr

Dlygpqyr

తాజాగా మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఆదివారం ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పన్నా జిల్లాలోని రాణిగంజ్ కు చెందిన ముఖేష్ ఠాకూర్, ఇందిరా ఠాకూర్ అనే దంపతులు దైవదర్శనం కోసం ఖేర్ మయ్ లోని ఒక గుడికి వెళ్లారు. ఆ గుడి అడవి ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో గుడికి వెళుతున్న ఆ జంటపై ఒక ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆ భార్యభర్తలిద్దరు ని చంపి అడవి లోకి లాక్కుని పోయింది. మామూలుగా ఎలుగుబంట్లు మనుషులు తినవు. కానీ ఈ ఎలుగుబంటి మాత్రం ఆ భార్యభర్తలిద్దరి పై దారుణంగా దాడి చేయడంతో పాటు ఆ ఇద్దరిని చంపి అడవిలోకి లాక్కెళ్లి దాదాపు ఐదు గంటల పాటు శరీర భాగాలను పిక్కు తిందట.

అయితే తోటి భక్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటి ని గుర్తించి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పట్టుకున్న ఆ ఎలుగుబంటి ని ఇంకా అడవిలో వదిలి లేదు. దానిని వేరే నగరంలోని జూకు పంపేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలుగుబంటి దాడిలో చనిపోయిన ఆ మృతుల కుటుంబానికి అధికారులు నాలుగు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

Exit mobile version