Be Alert: బీ అలర్ట్.. తుఫాన్ వచ్చేస్తోంది. అల్లకల్లోలంగా సముద్రం

ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో ఎండకాలం కాస్త వానాకాలంగా మారిపోయింది. వానాకాలం ముందే వచ్చేసిందా విధంగా వాతావరణం మారిపోయింది.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 09:55 PM IST

Be Alert: ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో ఎండకాలం కాస్త వానాకాలంగా మారిపోయింది. వానాకాలం ముందే వచ్చేసిందా విధంగా వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎండాకాలం అంతగా అనిపించడం లేదని, వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఈ నెలలో కూడా పరిస్థితులు అలాగే ఉండే అవకాశం కనిపిస్తుంది. మే నెలలో కూడా భారీ వర్షాలు పడే అవకశముందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర బంగాళాఖాతంలోని అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీనడం పెను తఫాన్ గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తంది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సైక్లోన్ ప్రభావంతో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

తుఫాన్ తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు పడతాయని, ఈదురుగాలులు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఒడిశాలోని గంజాం, గజపతి, జగత్సింగపూర్, పారాదీప్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలలో కళింగపట్నం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. పారాదీప్, కళింగపట్నం మధ్య తుపాన్ తీరం దాటే అవకాశముందని నిర్దారణకు వచ్చారు.

తుఫాన్ ప్రభావంతో తీరంలో సముద్ర కెరాటాలు 5 మీటర్లుకుపైగా ఎత్తులో ఎగిసిపడే అవకశముంది. తుఫాన్ హెచ్చరికలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.