Site icon HashtagU Telugu

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 భారత జట్టు ఇదే

WTC Points Table

WTC Points Table

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది బోర్డు. రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు, అయితే వైస్ కెప్టెన్ పేరు మాత్రం ప్రకటించలేదు.

కెప్టెన్ రోహిత్ శర్మ , యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్‌ ఓపెనింగ్ రానున్నారు. మిడిలార్డర్‌లో అజింక్య రహానే తిరిగి రాగా, .సూర్య కుమార్ యాదవ్ జట్టులో స్థానం దక్కలేదు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే WTC ఫైనల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో రహానే ఫుల్ ఫామ్ లో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయాడు.

వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ కు అవకాశం వచ్చింది. ఇషాన్ కిషన్ కు అవకాశం దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ విభాగానికి బాధ్యత వహిస్తారు. అశ్విన్, జడేజా, పటేల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ బౌలర్ ఆల్ రౌండర్ పాత్రను పోషించనున్నారు. పేస్ అటాక్‌కు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ మరియు జయదేవ్ ఉనద్కత్ నాయకత్వం వహిస్తారు.

భారత జట్టు చివరి టెస్టు సిరీస్‌ ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ సిరీస్‌ను భారత్ 2-1తో సమం చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా వరుసగా రెండోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనకత్ ఉన్నారు

Read More: GT vs MI: ఐపీఎల్‌లో నేడు హోరాహోరీ మ్యాచ్.. గెలుపెవరిదో..?