Campa- Atomberg: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు.. ప్రకటించిన బీసీసీఐ..!

టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ (Campa- Atomberg) సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని బీసీసీఐ వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
BCCI

BCCI

Campa- Atomberg: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ (Campa- Atomberg) సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని బీసీసీఐ వెల్లడించింది. 2024-26సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త స్పాన్సర్ల లోగోలతో ఉన్న దుస్తులు, కిట్లు ఉపయోగించనున్నారు.

Campa అనేది రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ క్రింద ఒక బ్రాండ్ అని మీకు తెలిసిందే. అదే సమయంలో ఆటంబర్గ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను తయారు చేసే సంస్థ. ప్రస్తుతం స్మార్ట్ ఫ్యాన్‌లు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల కంపెనీ స్మార్ట్ లాక్‌లు, ఇంట్లో ఉపయోగించే అనేక ఇతర వస్తువులను తయారు చేస్తోంది.

దీనికి సంబంధించి BCCI ఒక ప్రకటన విడుదల చేసింది. క్రికెట్ అభిమానులు మైదానంలో ఉత్తేజకరమైన పోటీలు, అసాధారణ ప్రదర్శనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అనుభవాన్ని మెరుగుపరచడానికి.. భారత క్రికెట్ స్థాయిని పెంచడానికి రెండు స్వదేశీ బ్రాండ్‌లు కాంపా, అటామ్‌బెర్గ్ టెక్నాలజీస్‌తో అనుబంధం కలిగి ఉండడం పట్ల BCCI సంతోషిస్తోందని ప్రకటనలో పేర్కొంది.

Also Read: CEO Suchana Seth: కొడుకును హత్య చేసిన స్టార్టప్ చీఫ్ పోలీస్ కస్టడీకి అనుమతి

BCCI ప్రెసిడెంట్.. రోజర్ బిన్నీ మాట్లాడుతూ ‘ఇండియా హోమ్ క్రికెట్ సీజన్ 2024-26 కోసం మా గౌరవప్రదమైన భాగస్వాములుగా కాంపా, ఆటమ్‌బెర్గ్ టెక్నాలజీస్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైన క్రికెట్ అనుభవాన్ని సృష్టించేందుకు మేము ఎదురుచూస్తున్నామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

BCCI సెక్రటరీ జే షా ఈ సహకారం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. 2024-26 దేశీయ సీజన్‌లో మా అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటమ్‌బెర్గ్ టెక్నాలజీస్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. కాంపా, అటామ్‌బెర్గ్ టెక్నాలజీస్ సహకారంతో క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైన అనుభవాన్ని సృష్టించేందుకు మేము ఎదురుచూస్తున్నాము. విజయవంతమైన క్రికెట్ సీజన్ కోసం మా సమిష్టి దృష్టికి ఈ భాగస్వామ్యం నిదర్శనం అన్నారు.

  Last Updated: 10 Jan 2024, 07:29 AM IST