Site icon HashtagU Telugu

BC’s For 34: 119 స్థానాల్లో బీసీలకు 34 సీట్లు

BC’s For 34

BC’s For 34

BC’s For 34: తెలంగాణాలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార పార్టీ తమ 115 అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. సీఎం కేసీఆర్ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా సిట్టింగులకే సీట్లను ఖరారు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో పండింది. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ వెళ్ళి అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీ నిర్వహించారు. వచ్చే దసరా నాటికి కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించనుంది. అయితే 119 స్థానాలకు గానూ బీసీలకు 34 సీట్లను కేటాయించాలన్న డిమాండ్ ప్రధానంగా తెరపైకి వచ్చింది.ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రముఖ స్థానం కల్పించాల్సిందిగా కోరారు.

బీసీలకు 34 సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చీఫ్‌ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ మాట్లాడారు. బహుజనుల పాత్ర లేకుండా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు జరగదు. రేవంత్ చెప్పిన విధంగా విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కనీసం 34 సీట్లు ఇవ్వాలి అని మధు యాష్కీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Also Read: AP : ఈరోజు చంద్రబాబు కేసుల ఫై పలు కోర్ట్ లలో విచారణ