GT Vs RR: రాయల్ బ్యాటిల్ లో గెలుపెవరిదో ?

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 10:30 AM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇరు జట్టు కూడా ఈ సీజన్‌లో తో తాము ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఇరు జట్లు కూడా అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయని చెప్పొచ్చు.

ఇక ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా రాజస్థాన్ రాయల్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని చెప్పొచ్చు… ఇక రాజస్థాన్ జట్టుసారథి సంజు శాంసన్ తొలి 4 మ్యాచుల్లో తనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకున్నాడని చెప్పొచ్చు. ఇక బ్యాటింగ్‌లో జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్.. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ మంచి టచ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శుభపరిణామమని చెప్పాలి..

ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికొస్తే..టోర్నీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పటి ఎలాంటి బెరుకు లేకుండా హార్దిక పాండ్య సేన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.. ఇక హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్ జట్టును తనదైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగంలో మాథ్యూ వేడ్ శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా , డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్ కీలక ఆటగాళ్ళని చెప్పొచ్చు… ఇక గుజరాత్ జట్టు బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.