Site icon HashtagU Telugu

Karnataka : సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన బ‌స‌వ‌రాజ్ బొమ్మై

Basavaraj Bommai 2 Imresizer

Basavaraj Bommai 2 Imresizer

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం రాజీనామా సమర్పించారు. బీజేపీ సీనియర్‌ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌కు బొమ్మై తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇక‌పై ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా పని చేస్తానని ఆయ‌న తెలిపారు. ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లు తగ్గాయని తెలిపారు.ఈ ఓటమి ఆత్మపరిశీలనకు, తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించిన ఆయన, రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపబోవని ప్రకటించారు.