Site icon HashtagU Telugu

KTR Tweet: ‘ఉదయ్ పూర్’ దోషులను కఠినంగా శిక్షించాలి!

Ktr

Ktr

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ని పట్టపగలు దారుణంగా హత్య చేసిన ఘటనను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) బుధవారం ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. “ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్యతో నమ్మలేని విధంగా భయాందోళనకు గురయ్యాను. దిగ్భ్రాంతికి గురయ్యాను” అని ఆయన ట్వీట్ చేశారు.

ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ వీధి ప్రాంతంలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా చంపారు. ఆ వ్యక్తి  బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశాడు. దీంతో దుండగులు దారుణం చంపారు. పట్టపగలు ఈ ఘటన జరగడంతో స్థానికులు నిరసనకు దిగారు. ఈ ఘటనతో ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ వీధి ప్రాంతంలో దుకాణాలు మూతపడ్డాయి. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉదయపూర్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు.