Site icon HashtagU Telugu

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ నెలలో వరుస సెలవులు?

Bank Holidays

Bank Holidays

సాధారణంగా ప్రతి నెల బ్యాంక్ లకు ఆదివారాలు శనివారాలతో పాటుగా అదనంగా కొన్ని బ్యాంకు హాలిడేస్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే బ్యాంకులకు పండుగ సమయాలలో అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజులలో గవర్నమెంట్ సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు గవర్నమెంట్ బ్యాంకు కి రోజుల తరబడి కూడా సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో బ్యాంక్ కస్టమర్ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ప్రతి నెల అలాగే అక్టోబర్ నెలలో కూడా గవర్నమెంట్ కొన్ని సెలవులను ప్రకటించింది.

మరి అక్టోబర్ నెలలో ఏ ఏ రోజులలో బ్యాంకులు సెలవులు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అక్టోబర్ నెలలో సెలవుల విషయానికి వస్తే 21 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయట. ఆదివారాలు శనివారాలతో కలిపి 21 రోజులపాటు బ్యాంకులకు సెలవులను ప్రకటించింది. ఆ తేదీల వివరాల విషయానికొస్తే.. మొదటి సెలవు అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఇక రెండవది అక్టోబర్ 5 దసరా పండుగ,అక్టోబర్ 24 దీపావళి పండుగ రోజు, అక్టోబర్ 1 అర్ధ బ్యాంకింగ్ క్లోజ్ డే, అక్టోబర్ 3 దుర్గా పూజ మహా అష్టమి, అక్టోబర్ 4 ఆయుధపూజ, అక్టోబర్ 6 దుర్గాపూజ దశమి.

అక్టోబర్ 7 దుర్గాపూజ దశమి, అక్టోబర్ 8 రెండవ శనివారం, అక్టోబర్ 9 ఆదివారం, అక్టోబర్ 13 కర్వ చౌత్, అక్టోబర్ 14 ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ, అక్టోబర్ 16 ఆదివారం, అక్టోబర్ 18 కటి బిహు, అక్టోబర్ 22 నాలుగవ శనివారం,అక్టోబర్ 23 ఆదివారం,అక్టోబర్ 24 కాళీ పూజ, దీపావళి, అక్టోబర్ 25 లక్ష్మీ పూజ దీపావళి, అక్టోబర్ 26 గోవర్ధన పూజ విక్రమ్ సవంత్ కొత్త సంవత్సరం రోజు, అక్టోబర్ 27భైదూజ్ చిత్రగుప్త జయంతి, అక్టోబర్ 30 ఆదివారం, టోపర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు. అక్టోబర్ నెలలో మొత్తంగా 21 రోజులు బ్యాంకు హాలిడేస్ ఉండబోతున్నాయి.

Exit mobile version