Bank Holidays In March 2023: మార్చిలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు..!

ప్రతి సంవత్సరం మార్చి (March) నెల బ్యాంకింగ్‌కు ప్రత్యేకం. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడమే ఇందుకు కారణం. దీంతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా హోలీ పండుగ కూడా ఈ నెలలోనే వస్తుంది.

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 07:15 AM IST

ప్రతి సంవత్సరం మార్చి (March) నెల బ్యాంకింగ్‌కు ప్రత్యేకం. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడమే ఇందుకు కారణం. దీంతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా హోలీ పండుగ కూడా ఈ నెలలోనే వస్తుంది. అటువంటి పరిస్థితిలో మార్చి నెలలో బ్యాంకింగ్ రంగంలో సెలవులు కారణంగా పని కూడా ప్రభావితమవుతుంది. మార్చి 2023లో బ్యాంకులకు మొత్తం 12 రోజుల సెలవులు ఉన్నాయి. అందువల్ల, ఆలస్యం చేయకుండా బ్యాంకుకు సంబంధించిన మీ పనిని వెంటనే పరిష్కరించుకోండి. భారతదేశంలోని బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు తెరిచి ఉంటాయి.

కాగా రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం.. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 12 రోజుల పాటు మూసివేయబడతాయి. ఇక్కడ మేము మీకు మార్చి 2023 బ్యాంక్ సెలవుల జాబితాను అందిస్తున్నాము.

మార్చి 2023లో బ్యాంక్ సెలవులివే

మార్చి నెల సెలవుల జాబితా

మార్చి 03: చాప్చార్ కుట్

మార్చి 05: ఆదివారం

మార్చి 07: హోలీ / హోలికా దహన్ / డోల్ జాత్రా

మార్చి 08: ధూలేటి / డోల్ జాత్రా / హోలీ / యయోసాంగ్

మార్చి 09: హోలీ

మార్చి 11: రెండవ శనివారం

మార్చి 12: ఆదివారం

మార్చి 19: ఆదివారం

మార్చి 22: గుడి పడ్వా / ఉగాది / బీహార్ రోజు / సాజిబు నొంగ్మపన్బా / మొదటి నవరాత్రి / తెలుగు నూతన సంవత్సరం

మార్చి 25: నాల్గవ శనివారం

మార్చి 26: ఆదివారం

మార్చి 30: రామ నవమి

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ బ్యాంకుల డిజిటల్ పనితీరు కొనసాగుతుంది. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్‌పై సెలవుల ప్రభావం ఉండదు. సెలవు రోజుల్లో ఖాతాదారులకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని బ్యాంకులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.